అతడు , నిరంతరం ఓ జీవ నదియై...ప్రవహిస్తూనే వుంటాడు!
ప్రవహించే పరీవాహకమంతా
పచ్చదనాన్ని నింపుతునే వుం టాడు...!
ఆనందపు చిరు నవ్వుల పువ్వులను పూయిస్తూనే వుంటాడు...!
సమస్యలకు పరిష్కారాల రూపాలను దాల్చుతునేవుం టాడు...!
అంతు చిక్కని ప్రశ్నలకు స మాధానాలై నిలుస్తూనే వుం టాడు...!
అతడొక గొప్ప పక్షపాతి...!
కుల, మత,ధనిక, పేద,వర్గబెధా లతనికి లేవు...!
అత డెప్పుడూ కేవలం ధర్మ పక్షమే..!!
నిర్ మొహమాటం , నిజాయతీ...అతని బలహీనతలు...!
అందుకే... బలవంతులకెపు డూ అతడు శత్రువే...!
ఆత్మ వంచనతో ... అలా బ్రతికే కన్నా... నిజమైన సాహితీ వేత్తగా....ఇలా చావటమె
మేలనుకుని ఇలా బ్రతికే స్తున్నాడు...!!
బీడు వారిన బ్రతుకులలో....
పచ్చ దనాన్ని నింపుతూ...
మోడు వారిన మోముల్లో ...
చిరు నవ్వులు పూయిస్తూ..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి