అమ్మ ఆఫీసుకి
వెళుతున్నప్పుడు ,
మూడ్ బాగుంటే ....
టా..టా ..చెబుతాడు ,
మూడ్ బాగోకుంటె ,
దీర్ఘరాగాలు తీస్తాడు !
ఆటలలోపడగానే
అన్నీ మర్చిపొతాడు ,
స్నానమనగానే -
ఎగిరెగిరి గంతేస్తాడు
టబ్ స్నానంలో
మైమరచిపోతాడు
పాలుత్రాగంగానే...
నిద్రపోతాడు....!
హారన్ తో పనిలేకుండా
అమ్మకారు చప్పుడు
ఇట్టె గుర్తు పట్టేస్తాడు
బయటకి తీసుకెళ్లమని
మారాము చేస్తాడు !
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి