చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 *సీస పద్యం*


చక్కగా రాతిని చెక్కిన శిల్పము
సొబగులులినదిద్ది సొమ్ములెట్టి
పసుపు గుంకాలతో భక్తిన పూజించి
గోపురాల గుడులు కూడిగట్టి
పూలదండలతోడ పుణ్యము బొందను
మొక్కెను రెక్కలు ముదముగాను
బాజభజంత్రీల భజనల జపములు
రాయి కీర్తిగాంచెను రాజసముగ

*తేటగీతి పద్యం*
తోరణాల ద్వారమునందు తొలగినంత
బండరాయిననుచు తీసి బయటవేసి
కొత్తబండలద్దిన చోటు కోటి ఫ్రభలు
నిలిచినపుడే ఘణము రాతి కొలువులందు

*కంద పద్యం*

చక్కని చిత్రము రాయిన
చెక్కెను శిల్పముకు పూజ శిల్పి ప్రతిభకున్
లొక్కులు పడినంత ప్రతిమ
మిక్కిలి దూరమున వేసి మిడుకుట సబబా!
కామెంట్‌లు