:శ్రీరామాపురం అనే ఒక మారుమూల గ్రామం ఉండేది, ఆ గ్రామం లో అన్ని రైతు కుటుంబాలే ఉండేవి ,ఆ గ్రామానికి కొత్తగా శంకరయ్య అనే టీచర్ రావడం జరిగింది, వచ్చి రాగానే గ్రామంలోని పిల్లలు అందరూ అల్లరి, చిల్లరగా తిరగడం చూసినాడు, మరుసటి రోజు పిల్లలు అందరూ బడికివచ్చి అల్లరి చేసి చెప్పింది వినకుండా, బడి నుంచి వెళ్లిపోవడం జరిగింది, ఇంటికి వెళ్లి సాయత్రం టీవీ మరియు ఫోన్ చూసి కాలక్షేపం చేయడం చూసి, శంకరయ్య టీచర్ కు బాధ కలిగింది, ఆ గ్రామంలో అందరూ నిరుద్యోగులు కావడం వల్ల పిల్లలు ఈవిధంగా తయారు అయారు అని గ్రహించి, వారినందరినీ, సాయంత్రం వేళల్లో టీవీలు, ఫోన్ లు ఎవరు చూడకుండా, తాను పిల్లలందరినీ ఆటలాడిస్తూ, నీతికథలు చెబుతూ ,వారిని చదువు వైపు మళ్ళించడం జరిగింది, ఈ విధమైన మార్పును చూసి గ్రామ పెద్దలు అందరూ శంకరయ్య టీచర్ ను సన్మానించారు,అటు అతను కూడా సన్మానం స్వీకరించి, అటు మీరు అందరూ, నావద్ద రాత్రి బడిలో అక్షరాలు నేర్చుకుని గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పితే, అందరు వచ్చి అక్షరాలు నేర్చుకున్నారు, గ్రామంలోని అందరిని విద్యావంతులు,ఆదర్శ వంతులుగా తీర్చిదినాడు.
ఈ కథలోని నీతి: గురువు తెచ్చిన మార్పు
గురువు గొప్పదనం:- కె.హిమవర్షిణి-ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి