"క్రిస్మస్" పర్వదినము:- -- గద్వాల సోమన్న
"యేసుప్రభు" జన్మదినము
ఈ "క్రిస్మస్" పర్వదినము
క్రైస్తవ సోదరులకు
ఎనలేని ఆనందము

కన్య మరియ గర్భాన
పాప పంకిల లోకాన
బాలయేసు జన్మ వేళ
అందరికి ఆనందహేల

క్రీస్తు పుట్టిన రోజున
క్రిస్మస్ తార వెలసెను
శిశువు యేసు చెంతకు 
జ్ఞానులను నడిపించెను

అవతార మూర్తి యేసు
ఆదర్శ మూర్తి యేసు
క్రీస్తు యేసు జీవితము
చూడ పరమ పావనము

యేసు జన్మదిన శుభములు
అక్షర శుభాకాంక్షలు
క్రైస్తవ సోదరులందరికి
చిరు నవ్వుల బాలయేసుకు


కామెంట్‌లు