ప్రముఖ గ్రంధాలయాలు : -సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 1గ్రంథాలయాలు ఎన్నో ఉన్నాయి.కొన్ని మనదేశంలో ఉన్న వాటిని గూర్చి తెల్సుకుందాం.వేటపాలెం లైబ్రరీ పేరు గాంచింది.ఇంకా కొన్ని పాతవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం.16వశతాబ్దికి చెందిన సరస్వతీ మహల్ తంజావూర్ లో ఉంది.తంజావూర్ని పాలించిన మరాఠాలు దీనిని నెలకొల్పారు.తమిళసంస్కృత ఫారశీతోపాటు ఎన్నో భాషల పుస్తకాలు పాండు లిపిలో ఉన్నాయి.దస్తావేజులతో సహా ప్రాచీన చారిత్రక ఆధారాలు తెలిపే పుస్తకాలు కోకొల్లలు.పరిశోధకులు పి.హెచ్.డి.చేసేవారు తప్పక దీనిని సందర్శిస్తారు.మరాఠారాజవంశ కీర్తి ప్రతిష్ఠలు తెలిపేలా ఈలైబ్రరీ వాస్తు కళ ఉండటం గొప్ప విశేషం.
2 కేరళలోని తిరువనంతపురం లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ 1829లో నెలకొల్పబడింది.దీని చుట్టూ అందమైన తోట తో అలరారు తోంది.యు.పి.లోని
రాంపుర్ రజా లైబ్రరీని 1774 లో నవాబ్ ఫైజుల్లాఖాన్ నెల కొల్పాడు.అరబ్బీ ఫారసీ ఉర్దూ ఆంగ్లం లో పాండు లిపిలో 30వేలపుస్తకాలున్నాయి.చారిత్రక దస్తావేజులకి ప్రసిద్ధి.1900లోరవీంద్రనాధ్ టాగూర్ శాంతి నికేతన్ లో నెలకొల్పింది టాగూర్ లైబ్రరీ.ఇది సాహిత్య భాండాగారం.
3 పాతాళ భువనేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి 90 అడుగుల లోతులో ఉంది.ఉత్తరాఖండ్ లోని పిథౌరాగఢ్ లో ఉంది.గుహలో ప్రవేశం చాలా కష్టం.స్కందపురాణంలో దీని మహిమ చెప్పబడింది.త్రేతాయుగంలో ఋతుపర్ణుడనే రాజుఈగుహను కనుగొన్నాడుట! నాగుల రాజు అధిశేష్( ఆ ప్రాంతంలో అలాగే పిలుస్తారు) ఋతుపర్ణరాజుని గుహలోకి తీసుకుని వెళ్లి శివుని దర్శింపజేశాడని ఐతిహ్యం.పాండవులు అజ్ఞాతవాసం లో గుహలోకి వచ్చి శివుని అర్చించారు.ఆదిశంకరాచార్యులవారి వలన మనకి తెలిసినది
4ఈశిలలు ఎలా ఉంటాయంటే100 కాళ్లున్న ఐరావతం ఏనుగు లాగా అధిశేషునిలాగా కన్పడ్తాయి.ఈఆలయంకి 4ద్వారాలున్నాయి.రణద్వార్ పాపద్వార్ ధర్మద్వార్ మోక్ష ద్వార్ అని పిలుస్తారు.రావణుడు చనిపోయాకపాపద్వారం కురుక్షేత్ర సంగ్రామం తర్వాత రణద్వారం మూసివేయబడినాయి.గుహలోపలికి వెల్తే కొన్ని రాళ్ళు శివుని జటాజూటం లాగా కన్పడ్తాయి.శివుడు ఖండించిన వినాయకుడి శిరసుని ఇక్కడ స్థాపించినట్లు ఒక ఐతిహ్యం.ప్రకృతి సిద్ధమైన ఎన్నో ఆకృతులు కన్పడ్తాయి గుహలో!
కామెంట్‌లు