అరుదుగా అప్పుడప్పుడు
అనుభవాలు
అతలాకుతలంలో ఆనందంలోనో
జన్మకో శివరాత్రిలా తలుపు తట్టొచ్చు
మునిగి తేలించే ఉద్ద్వేగ సందర్భాలు
మనలో కొమ్మ ఊయల
నిద్రలోనో మెలకువలోనో ప్రకంపాలు
భూమి ఎదలో నదీ గర్భంలో
ప్రశాంత కాలం పరుగులు
భూకంపం సునామీల సూచికలే
మనిషి
సంభ్రమాశ్చర్యం భయాందోళనల తేలిన
స్వర్గ నరకాలు పూలూ ముళ్ళ టచ్ లో
కుర్చీలోనో శయ్యపైనో
ఊయలలూపే తొలి అనుభవం
నొప్పి తెలియని మత్తు గాయం ఓకే కానీ
మరణ మృదంగం రాపిడి తాకిడి చీల్చిన నేలపై,కోసిన నదిగర్భంలో
విశృంఖల విచలిత నాట్య ప్రకంనలన్నీ
కోలుకోలేని దెబ్బలే ప్రకృతికి
మాయని గాయాల నొప్పులే బతికే మనిషిలో
ఇప్పుడు
గోదావరి నది పరీవాహకం
తలదాచుకున్న తెలంగాణాంధ్ర తీరంలో
మేడారం కేంద్రంలో 5.3 తీవ్రతలో భూకంపం
వరంగల్ కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ జిల్లాలు తాకే
అనుభవైక వేకువ జాము మట్టి మనుషులదే
నిద్రలేచిన ప్రకంపనల విహ్వలం
అలల మునిగి తేలే నీటి
భయోత్పాతం ఉత్సుకతల ప్రకంపనల అనుభవమంతా మనిషీదీ ప్రకృతిదే
1969 వేసవిలో రాత్రిపూట
బయ్యారంలో మంచంపై నిద్రలో నేను
ఊయలలూగిన అపూర్వ తొలి అనభవ భూకంపం యాదిలో నేను
1983 ఎండాకాలం మధ్యాహ్నం హైదరాబాద్ నడిబొడ్డును పలుకరించిన ట్రెమర్స్ కూడా జ్ఞాపకాల దొంతరలు నాలో
నాటి కథల అనుభూతి కలల గుర్తులై విరిసే
విస్మయంగ నాలో
మళ్లీ వీచే ముసిముసి యాది
======================================

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి