సాకీ :- బాట సారిగా ఈ మజిలీకి వచ్చిన ఓ జీవా,
ఇక్కడి భ్రమలలో నీవు మునిగి పో యావా ,
నిన్ను నీవే మరచి పో యావా...!
పల్లవి:- ఇక్కడ
నీ దీ నా దీ ఏ దీ లేదు...
నిజము తెలుసుకోజీవా..!
నిగ్గు తేల్చుకో రా జీవా!!
" నీ దీ నా దీ.... "
చరణం :-
నేల, నింగి, నీరు, గాలి....
యే ఒక్కడి సొత్తు కావురా...2
ఇవి యే ఒకడివి , అను కోకురా....!
"నీ దీ నా దీ.... "
చరణం:-
ఈ భూమి మీదనువ్వున్నం తవరకు ,
పదుగురి తోనూ మంచిగా నీవు మసలరా ,
ఆనందముగా బ్రతకరా...!
"నీ దీ నా దీ.... "
చరణం:-
మితి మీరిన వ్యా మోహా లతో,
నీ బ్రతుకును నరకము చేయకురా..,
యే ఒకరినీ వేధించకురా
యే ఒక్క రిని వేధించ కురా...!
" నీ దీ నా దీ.... "
చరణం:-
పగల సెగలు రగిలించకు
ఈర్ష్యా,ద్వేషము పెంచకు
ఆనందము పంచు, ఆనం దించు,
"నీ దీ నా దీ..... "
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి