ఒక ఊరిలో రాజు సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాజు కుంటివాడు సోము గుడ్డివాడు.ఒక రోజు రాజు సోముతో ఈ పక్కన అయిటిపాముల అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక జాతర జరుగుతుందట చాలామంది భక్తులు అక్కడికి వస్తారు మనం అక్కడికి వెళ్తే ధర్మం రూపములో మంచి ఆదాయం వస్తుంది అన్నాడు.దానికి సోము ఆ ఉరేమో చాలా దూరంల ఉంది నీవు కుంటివాడవు నేను గుడ్డి వాడిని మనం అక్కడికే ఎలా చేరుకుంటాము అన్నాడు. నువ్వు అటువంటి దిగులేం పెట్టుకోకు మనం అక్కడికి చేరుకోవడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. నువ్వు గుడ్డివాడివైనా నడవగలవు నేను కుంటివాడినైనా చూడగలను. నువ్వు నన్ను ఎత్తుకో నేను నీ మీద కూర్చుంటాను కాబట్టి మనం ఒకరికొకరు సాయం చేసుకుంటు అక్కడికి హాయిగా చేరుకుందాం. నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకొని నీవు నడుస్తుంటే నేను నా కళ్ళతో బాటని చూపిస్తాను అన్నాడు. అలా ఇద్దరు జాతర జరిగిన చోటకు పోయారు.అక్కడ జనం మంచోళ్ళు ఉన్నట్టున్నారు మనకు బాగానే డబ్బులు ఇచ్చారు.చాలా ఆనందం గా ఉన్నది అని సంబర పడి వారి ఊరికి పయనం అయినారు.
నీతి :ఒకరికొకరు సాయం చేసుకోవడం వలన కష్టాలనుండి బయటపండగలం.
నీతి :ఒకరికొకరు సాయం చేసుకోవడం వలన కష్టాలనుండి బయటపండగలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి