అందాల రాశి:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
బొక్కెన తోడే మోటబాయి ఊట
మనసెళ్ళే తొవ్వ 
అందాల కొబ్బరితోట ఎంత చెప్పినా 
కనులు చాలవు చూడ!

ఆహ్లాదం అద్భుతం ప్రకృతికోన 
ఆడిపాడే హృదయాన
పూసే నీరెండ పగలురేయి రహదారి

ఆకునడుమ దూరే వెలుగుదారం 
నింగి పొద్దు లేతవేళ్ళు
మనసు పరవళ్ళ గోదారి దారి

ఆకులల్లుకున్న గాలి కరటాలు 
అవని చుట్టేసిన 
అందమైన కలలు పులకించే కాంత ప్రకృతి 


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Wonderful description of Nature as a beautiful woman