అనగనగ ఒక గ్రామంలో రోజా, లలిత ,సరిత ,అనే మంచి స్నేహితులు ఉండేవారు.వాళ్లు ఎప్పుడు కలిసి మెలిసి ఉంటారు. వాళ్లకి గొడవలు వచ్చిన మళ్లీ వెంటనే కలిసేవారు. కోపాలు పట్టింపులు కూడా ఉండేవి కావు. ఆ కోపంలో ఎవరిది తప్పు ఉన్న ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకునేవారు .రోజా కి చెట్లు ఎక్కడం వచ్చు, ఒకరోజు ఆ ముగ్గురు స్నేహితులు అడవికి కట్టెలు తీసుకురావడానికి వెళ్లారు, కట్టెలు తీసుకొని వస్తుండగా చీకటి అయ్యింది. సరిత ఇలా అన్నది. చాలా చీకటి అయింది తొందరగా వెళ్ళాలి అని అన్నది.ముగ్గురు స్నేహితులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు .అప్పుడే హఠాత్తుగా ఒక పెద్ద పులి వచ్చింది. ఆ పులిని చూసి వాళ్ళు భయపడ్డారు ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు చాటుకి దాచుకున్నారు .రోజా మాత్రం ఒక పెద్ద చెట్టు ఎక్కింది. ఆ ముగ్గురు స్నేహితులు పులి ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు, కానీ పులి మాత్రం పోవట్లేదు. అది మనుషుల వాసన పసిగట్టి అక్కడనే అటు ఇటు తిరుగుతుంది. అప్పుడే చెట్టు సాటికి దాచుకున్న సరితను పులి చూసింది, పులి సరిత వైపు చిన్నగా వెళ్ళ సాగింది, అప్పుడే రోజా చెట్టు దిగి కింద ఉన్న రాయి తీసుకొని పులి వైపు విసిరింది, ఆ రాయి పులి తలకి తాకింది, పులి కోపంగా రోజా వైపు పరిగెత్తింది . రోజా తొందర తొందరగా కింద ఉన్న కర్రను తీసుకొని పులి తల మీద గట్టిగా కొట్టింది. చెట్టు చాటుకి దాచుకున్న లలిత కూడా ఒక కర్రను తీసుకొని వచ్చి, పులిని కొట్టింది. ఒక కాంచి రోజా, ఇంకో కాంచి లలిత, పులిని చావు చావు కొట్టారు. అప్పుడే రోజా ఇలా అన్నది, జంతువులని చంపకూడదు అని అన్నది. జంతువులను చంపితే పాపం తగులుతుంది అని పులిని వదిలిపెట్టారు, పులి భయంతో పారిపోయింది.రోజా, లలిత ,సరిత కట్టెలు తీసుకొని ఇంటికి క్షేమంగా వెళ్లారు.
ఈ కథలోని నీతి: మిత్రులతో కలిసి మెలిసి ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.
ఈ కథలోని నీతి: మిత్రులతో కలిసి మెలిసి ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి