ప్రపంచ పండుగ ..!!: -డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 పండుగలు -పబ్బాలు 
వస్తుంటాయ్ ...
పోతుంటాయ్ ...
కొన్నిమాత్రం -భలే ,
ప్రత్యేకతను కలిగి ఉంటాయ్ !
డిశంబరు నెల మొదలైతే 
క్రిస్మస్ సంబరాలు -
ఊపందుకుంటాయ్ !
నూతన సంవత్సరం -
వచ్చేవరకూ ...
ఇదేవాతావరణం ,
ఇదే ఉత్సాహం ,
ఇదే హడావిడి ...
ఇదేఆనందం ....!
ఇది మనదేశానికి మత్రమే 
పరిమితంకాదు ...
విశ్వవ్యాప్తంగా ...
రంగురంగుల కాంతులతో .
ప్రతిఇంటా 'క్రిస్మన్ ట్రీ '
ఇంటిపైన ' క్రిస్మస్ స్టార్ '
సందడి ..సందడిగా 
చర్చి ప్రాంగణాలు ....
అందరిచూపు అటువైపే !
అందరినోట -
అదే పండుగ మాట ....!!
                ***

కామెంట్‌లు