ఆటకూ ఆకలికి తెగని లంకెలో నా ఊరు
గుండె గుడిసె చిరునామాలో నవ్వే పల్లీయం
అడిగిన వారితో కాదనక చేసే ఊరు కరచాలనం
ఆశలకూ ఊసులకూ రత్నగర్భ ఊరు మనసు
అహానికీ ఆప్యాయతకూ నెలవు పల్లె అభిజాత్యం
ఇరుగు పొరుగు మాటా ముచ్చటే కొసిరే అందం
గాలివాటం సాగనిదే ఉత్తరగాలి మహిమ ఇల
మంచు కురిసిన పూల అందాలే మనసు మనసున
నల్లేరు నడకల పల్లేర్లు ఏరిన మట్టి ఊరే
ఊరంటే ఊరుగాదు వరి సిరుల
అన్నపూర్ణ
పిలిచి పీటేసిన ఆత్మీయం పంచప్రాణాల ఊరు
చిన్నాపెద్దా తేడాలేక హృదయసీమలు పూచే ఉదయం
గుసగుసల తేలే గాలి గొంతూ గడసరి వీణ
సుఖసంతోషాల పద పాదం వీచే భావనలో సరిసరి
జవ్వని పల్లె సంభాషణ బువ్వ కూరల దినుసులల్లె
తనువంత నగ ఆకుపచ్చ నడుమ మెరిసే పూలతంగేడు
పరిమళించిన మట్టి మొగిలిపూల వాన చిందు
చిలుక గోరెంకల కొమ్మ ఊయల లూగె ప్రణవం
పురివిప్పిన మయూరి నడకల అందాలు
షర్మిలటాగూర్ అభినేత్రి సావిత్రి నటనల మురిసే కావ్యం
మట్టిసీమ గాలిఅలల ఈలలు ఊదే రసమయ గీతిక
ఎంతని వర్ణించిన తనివితీరనిది సుందర బంధం
ఏమని చెప్పను కనిపించని నిన్నటి అందాల గీత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి