న్యాయములు-713
షోడశికా గ్రహణాగ్రహణ న్యాయము
****
షోడశ అనగా పదునారు లేదా పదహారవది.గ్రహణ అనగా పట్టుకొనుట,స్వీకరించుట,పలుకుట, ధరించుట, గ్రహణము నేర్చుకొనుట,మనసున పట్టించుకొనుట,సంపాదించుట. ఆగ్రహణ అనగా పట్టించుకోకుండా ఉండుట,స్వీకరించక పోవడం,పట్టుకోకపోడం ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
షోడశిని గ్రహించుట,గ్రహింపక పోవడం వలె అని అర్థము.
"అతిరాత్రే షోడశినం గృహ్ణాతి" " నాతి రాత్రే షోడశినం గృహ్ణాతి"-అనగా అతి రాత్రమున షోడశిని గ్రహించవలెను,గ్రహింపరాదు అని రెండు రకాలైన నియమాలు ఉన్నాయి.
అపేక్షా భేదము చేత అనగా ఇష్టాయిష్టాలతో అతిరాత్రమున షోడశిని గ్రహించడం, గ్రహించకపోవడం అనగా మానేయడం అనేది రెండింటిలో ఏదైనా విధి విహితమే.
అనగా "షోడశికాగ్రహణాగ్రహణవ ద్వికల్పే ప్రాప్తే-----" అనగా అవునని, కాదని అటూ ఇటూ ఊగిసలాట సమయంలో మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఇక విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. షోడశోపచారములు అనే పదబంధం మనందరికీ తెలిసిందే. పదహారు ఉపచారాల్లో భగవానుని ఆరాధించడం .
అయితే అతి రాత్రము అనగా సప్త సోమ యాగాలలో అతి పవిత్రమైనది 'అతిరాత్రం'.ఈ అతిరాత్రం అనే యాగాన్ని రామాయణంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగంతో పాటు దీనిని కూడా చేశాడని ఉంది.
దీనిని మన దేశాన్ని పరిపాలించిన రాజులలో గుప్తులు, చోళరాజులు నిర్వహించేవారని చరిత్ర వలన తెలుస్తోంది.
విశేషం ఏమిటంటే నేటికి కూడా కేరళలోని నంబూద్రి కుటుంబీకులు ఈ యాగాన్ని ఇప్పటికి కూడా నిర్వహిస్తున్నారు."
యాగములు అన్నింటిలో అతిరాత్రం మహా యాగం లోక కళ్యాణం కోసం, ప్రపంచ శాంతి కోసం చేస్తారు. అతి రాత్రం అనగా రాత్రిని జయించినది.రాత్రి అనేది చీకటికి, అజ్ఞానానికి, బాధకి, దుఃఖానికి సంకేతం.ఈ యాగము వల్ల ఇటువంటి ప్రతికూల భావాలన్నీ జయింపబడుతాయి. ఈ యాగంలో అన్ని వస్తువులను కర్రతోనే తయారు చేస్తారు.యాగమును పన్నెండు రోజుల పాటు జరుపుకుంటారు. ఇందులో మొదటి మూడు రోజులు దీక్షా సమయంగానూ, ఆ తర్వాత ఆరు రోజులు ఉపాసనా దినములుగానూ,చివరి మూడు రోజులలను సూత్యంగా పిలుస్తారు.
ఈ అతిరాత్ర యాగము చేయడానికి కారణం ప్రకృతిని కాపాడటానికే అంటారు వేద పండితులు. ప్రకృతిలో జీవశక్తిని పెంచడానికి సోమలత నుండి తీసే సోమరసాన్ని అగ్ని ద్వారా దేవతలకు సమర్పించడమే ఈ యాగము యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటారు. భారతీయులు అరుదుగా చేసే యాగాలలో అతిరాత్రం అనేది ఒకటి ఈ అతిరాత్ర యాగములో షోడశిని గ్రహించకపోవడం అనేది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది.
ఇంతగా చేసే ఈ యాగములో ఈ షోడశిని గ్రహించుట గ్రహింపక పోవడం అనేదాన్ని అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదని,వీలును బట్టి షోడశి అవసరం ఉందని చెప్పడమే ఈ న్యాయము లోని అంతరార్థము.షోడశిలో మానవుడు చేయాల్సిన కర్మలు పదహారు ఉన్నాయి.వాటిని పాటించడం,పాటించక పోవడం అనేవి దృష్టిలో పెట్టుకోవాలనే అర్థం ఇందులో ఇమిడి ఉంది.
వేటికైనా కొన్ని పట్టు విడుపులు ఉంటాయి కాబట్టి మూర్ఖ పట్టు పట్టకఁ ఎటు వీలైతే అటుగా వీటిని పాటించడమే మన కర్తవ్యం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి