మహానీయుని-మహితోక్తులు :: ---విజయలక్ష్మి.కస్తూరి.

 క్రీస్తు జననం 
మనందరికీ సందేశం 
ఒకరిని వేలెత్తి 
చూపించే ముందు 
నీ వైపు నాలుగు వేళ్ళు 
చూసుకో అన్నారు..
దానర్థం?...
మనలో వున్న లోపాలను 
సరిదిద్ధుకోమని...
పరులసొమ్ము ఆశించ వద్ధు
అంటే?....
మోసం చేయకూడదు...
ఇలా ఎన్నో......!
ఆఖరికి శిలువ మీద 
రక్తాలు కారుతున్నా 
వీరేమి చేయుచున్నారో?....
వీరెరుగరు అన్నారు 
ఇది క్షమాగుణానికి
తార్కాణం...
ఆయన జననం 
మరి మనకు 
సందేశాత్మకమే కదా,.....!
              ***
కామెంట్‌లు