అత్యాశ :- దొనకొండ అన్వి-ఆరవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, వారి పేరు "గంగ,రంగా" వారు ఉండే గ్రామం లో ఒక్క చెరువు ఉండేది, ఆ చెరువు లో చేపలు పట్టడానికి వెళ్ళారు,మళ్ళీ మరుసటి రోజు యదావిధంగా చెరువు లో ఇద్దరు స్నేహితులు కలిసి చేపల కి వెళ్ళారు, రంగా కి వలలో మయదీపం దొరికింది,మయాదీపంలో నుండి మయాశక్తి వచ్చినది, రంగ నీకు ఏమీ కావాలో చెప్పు రంగ అని అన్నది మయాశక్తి,అప్పుడు రంగ నాకు పెద్ద బంగ్లా,వేల కోట్ల రూపాయలు కావాలి, కావున నీ ఆభరణాలు నాకు కావాలి అని అడిగాడు. అదే విధంగా నాతోటి స్నేహితుడు గంగా కి ఇవ్వకు ఓ మాయ శక్తి, నేను ఒకడినే తీసుకుంట అని అనగా రంగా కు ఇచ్చినది,అప్పుడు గంగా నాకు ఏమి వద్దు "రెండు చేపలు" చాలు నేను నా కుటుంబం తో సంతోషంగా ఉంటే చాలు అన్నాడు, మరి ఇంకెవరికి చెప్పకు అని ఇద్దరు స్నేహితులు ఎవరింటికి వారు వెళ్లారు. 
కొన్ని సంవత్సరాల తర్వాత, రంగా వాళ్ళ ఇంటి మీద దొంగలు,దాడి చేసి వాళ్ళ ఇంట్లో ఆభరణాలు, వేలకోట్లు దొంగలు దోచుకెల్లగా రంగా కుటుంబం రోడ్డున పడ్డాడు,రంగా, గంగ వాళ్ళ ఇంటికి వెళ్లగా సంతోషంగా ఆదరించాడు .

ఈ కథలోని నీతి ÷
             మన స్థాయికి మించి కోరిక,ఆశ మరియు హద్దులు దాట కూడదు అది మనిషి వ్యక్తిత్వం.

                :
కామెంట్‌లు