*సీసం*
పొలమున నాగలి పుడమిని పెకలించి
దున్నిన సాలున దుక్కిచదను
మడినందు నీటిన తడితోని మట్టియు
దారులు విడిచిన తాండవించు
బురదమయున రైతు బుద్దితో యెద్దుల
మడిన తింపే నేర్పు మనసుదోచు
గొర్రుతో సర్థుతూ జర్రున జారుతూ
పడుతు లేచి పరుగు పగ్గమట్ట
*తేటగీతి*
ఒడ్డు వొరము గలుమలకు వొండ్రుపెట్టి
నారు కావడందున పంచు నాటువేయ
గోకలందున తిరుగుతు గుంటుకేసి
పొద్దుగూకు వరకు రైతు పొలమునుండు
*కందం*
నాటును వేయగ పడతుల్
జంటగ వెనకాల నడచి సన్నని నారున్
మేటిగ విప్పుతు నాటుతు
సూటిగ సాగినను వొడ్డు చురుకున చేరేన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి