చందమామ:- బి. చిద్విలాసిని, ఏడవ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిటిపాముల, నల్లగొండ జిల్లా,
 అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు రసూల్ గూడెం ఆ ఊరిలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలోని సభ్యులు ఎంతో ప్రేమాభిమానాలతో ఉండేవారు. ఆ కుటుంబంలో  ఇద్దరు పిల్లలు ఉండేవారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అమ్మ వాళ్ళిద్దరు పిల్లలను చాలా ప్రేమగా చూసుకునేది. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలలో పిల్లవాడు చాలా చిన్నవాడు,  ఒక రోజు రాత్రి పిల్లవాడు ఎంతకు అన్నం తినలేదు అయితే వాళ్ళ అమ్మ ఆ రాత్రి పిల్లవాడికి చందమామను చూపించి అన్నం తినిపించాలని అనుకున్నది. అలా చేసినా కూడా పిల్లవాడు అన్నం తినలేదు. కానీ తర్వాత మళ్లీవాళ్లమ్మ ఒక ఉపాయం ఆలోచించింది. చందమామను చూపించడంతోపాటు చందమామ పాట పాడుతుంటే ఆ పిల్లవాడు గబ గబా అన్నం తిన్నాడు. ఆరోజు నుంచి రోజు వాళ్ళమ్మ చందమామను చూపిస్తూ పాట పాడుతూ తినిపించేది. చందమామ లేని రోజుల్లో అతను  తినడానికి చాలా మారాం చేసేవాడు. అలా చాలా కష్టం మీద ఆ పిల్లవానికి ఎలానో ఒకలా చందమామ లేని రోజుల్లో తినిపించేది. 

నీతి :- పాటకు లొంగని ప్రాని లేదు 

             

కామెంట్‌లు