జీవన పునాది :- ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
నాడు ఉండే అడవులెన్నో 
నేడు వాటిని నరికారు 
చల్లటి గాలి కరువాయే 
వాతావరణం మారిపోయే 

పీల్చే గాలి కాలుష్యం 
భుజించే పదార్థాం కలితి
నేడు ఆరోగ్యానికి చేటది 
మనిషి మొనగాడ సాగేదేలా

ఈనాటి చిన్నారి పిల్లల్లారా
ముందు జాగ్రత్త పాటించి 
చక్కగా మొక్కలు నాటండి 
శ్రద్ధ తోటి మీరు పెంచండి 
 
పచ్చదనం  చూపండి
ప్రాణవాయువు నింపండి 
ముందు తరాల వారికీ
జీవన పునాది వేయండి


కామెంట్‌లు