అలసిన వయసున అందంగా
అమరిన ముంగిట ఆనందంగా
అపురూపంగా ప్రతి క్షణమూ
అనుభవిస్తూ ఆహ్లాదంగా....
అవనిలోనే అద్వితీయమైన
ఆనందామృతపు బిందువులన్ని
అన్వేషిస్తూ ఒక్కొక్కటిగా
ఆస్వాదిస్తూ మొత్తంగా...
ప్రకృతిలో ఒక భాగంగా
మమేకమయ్యే సంతోషపు
క్షణాలకోసం నిరీక్షించి
సమీపించిన తరుణంలో...
కలతలు కన్నీళ్లు కనుమరుగయ్యే
కమనీయ దృశ్యావలోకనపు
కమ్మని మధుర క్షణాలను
కదలక మదిలో నిక్షిప్తమొనరించి
మోయలేనంత హాయిని మోస్తూ
దాయలేని సంతోషాన వెలిగిపోతూ
వ్రాయలేని భావాల తేలిపోతూ
బాయలేని బంధాలు వేసుకుంటూ
గోరువెచ్చని కిరణాలలో
నులివెచ్చగా చలికాచుకుంటూ
మేలుకొలుపులు పాడుతున్న
మార్గశిరపు మేలిపొద్దునకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి