జరుగుతున్న కాలంలో
కరుగుతున్న క్షణాలన్నీ
పెరుగుతున్న వయసుగా
తరుగుతున్న జీవిత కాలం
ప్రతి క్షణము పరుగులైతే
పరవశించిదేపుడు?
అనుదినము ఆరాటాలైతే
ఆస్వాదించేదెపుడు?
తెల్లవారి వెలుగుల్లో
అల్లుకున్న లతల్లో
మెల్లగా విచ్చుకునే
చిన్ని పువ్వుల సోయగాలు...
చిన్ని రెక్కల చప్పుడుతో
అన్ని గువ్వలొక్కటిగా
ఆనందగీతాలు ఆలపిస్తూ
జగతికి పాడే మేలుకొలుపులు
జలపాతాల జాలువారే
జలధారల ప్రవాహాలు
జలజలా సాగుతూ
శిలలతో చెప్పే కమ్మని కబుర్లు
చిన్ని అనుభూతులు
ఎన్నో ఆనందాలు
కొన్ని అపురూపాలు
అన్నీ పోగేసుకునేదే జీవితం
ఆకాశాన జరిగే అద్భుతానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి