బంగారు పాప వచ్చింది
బంతిపూలు తెచ్చింది
వింతగా మాల కట్టింది
చెంత చేరి నిలిచింది
చిన్నారి పాప చూసింది
పొన్న పువ్వులు కోసింది
వన్నెల మాల చుట్టింది
వదిన మెడలో వేసింది
ఒంటరి పాప వచ్చింది
వెంటబడి నడిచింది
తుంటరి పనులు చేసింది
తంటాలెన్నో తెచ్చింది
అవ్వ తాత వచ్చారు
ముగ్గురి పిల్లలను పిలిచారు
వారి బుగ్గలు నిమిరారు
చక్కగా ముద్దులు పెట్టారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి