పర్యావరణానికి ప్లాస్టిక్‌ చేస్తున్న హాని:-సి.హెచ్.ప్రతాప్

 ప్రస్తుత ప్రపంచంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని విస్మరించలేం. అది మన జీవితంలో ఒక భాగంగా స్థిరపడింది. వాణిజ్యపరంగా భారతదేశంలో ప్లాస్టిక్‌ రంగానికి చాలా భవిష్యత్తు ఉంది. కాని పర్యావరణ రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్లాస్టిక్‌ అవసరాన్ని గుర్తిస్తూనే మనం దాన్ని నియంత్రించినప్పుడు మాత్రమే ఈ అందమైన పర్యావరణాన్ని ముందు తరాల వాళ్ళకు బాధ్యతగా అందించగలుగుతాం. వాతావరణానికి, పర్యావరణానికి ప్లాస్టిక్‌ చేస్తున్న హాని మాటలతో చెప్పడం సాధ్యం కాదు. మానవాళితో పాటు భూమి మీద సమస్త జీవరాశి భవిష్యత్‌ను ఇది సవాల్‌ చేస్తోంది అని ఐక్య రాజ్య సమితి రెండు దశాబ్దాల క్రితమే మానవాళిని హెచ్చరించింది. అయినా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలు చేపడుతున్న చర్యలు అంతంత మాత్రంగానే వున్నాయి.
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఒట్టావాలో గత వారం ప్లాస్టిక్‌ వినియోగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సు లో ఎలాంటి కార్యాచరణ పధకంపై ఉమ్మడి కార్యాచరణ కుదరలేదు .192 దేశాలకు చెందిన ప్రతినిధులు వారం రోజుల పాటు సమావేశమై సుదీర్ఘంగా జరిపిన చర్చల్లో ప్లాస్టిక్‌ నిషేధం గురించి కాదు కదా, కనీసం ఉత్పత్తులపై పరిమితంగా ఆంక్షలు విధించే విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. దానితో ఈ సమస్యపై ప్రపంచ దెసాలవన్ని ఉత్తుత్తి పై కబుర్లే అని తేటతెల్లమైపోయింది.అయితే మన దెశం మాత్రం ఈ సమస్య పరిష్కారానికి తక్షనం నడుం బిగించడం అవసరం. స్థిరమైన, సమర్ధవంతమైన ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తయారు చేయడం, సరైన రీసైక్లింగ్‌ విధానాలను అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటం తక్షణం ప్రభుత్వాలు చేయాల్సిన కర్తవ్యాలు.ప్లాస్టిక్ పరిశ్రమపై పరోక్షంగా కోట్లాదిమంది ఆధారపడి ఉన్నందున  వీరందరికి ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.  
కామెంట్‌లు