సతీ సావిత్రి కథ మనందరికీ తెలుసు.యమునితో సంవాదం చేసి భర్త ప్రాణాలు తిరిగి దక్కించుకుంది.ఆమె పుట్టింటి అత్తింటి విశేషాలు తెలుసుకుందామా? మద్రదేశరాజు అశ్వపతి.ఆరాజుపెద్దభార్య ధర్మశీలవతి.వారిబిడ్డనేసావిత్రి.సావిత్రమంత్రహోమంతో పుట్టింది కాబట్టి ఆ పేరే పెట్టారు.యుక్తవయసువచ్చిన కూతురు తో రాజన్నాడు" నీకు తగిన భర్తను నీవే అన్వేషించు.
వివాహ వయసు వచ్చిన తర్వాత కన్యాదానం చేయని తండ్రి వితంతు తల్లిని పోషించని కొడుకు
ధర్మం తప్పిన పనికిమాలిన వారని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి" అని అంత స్వేచ్ఛ ఇచ్చాడు రాజు తన కూతురు కి.అప్పుడు సావిత్రి వృద్ధమంత్రులతో కల్సి వరాన్వేషణకు స్వయంగా బైలుదే
రింది సావిత్రి.అన్ని తీర్ధాలు మహాత్ములను దర్శించి
తండ్రి దగ్గరకు వచ్చింది.ఒకరోజు అశ్వపతి దగ్గరకు నారదుడు వచ్చాడు.తండ్రి అనుమతితో తాను ఎన్నుకున్న వరుని గూర్చి చెప్పింది."నాన్నా!సాల్వదేశరాజు ధర్మాత్ముడైన ద్యుమత్సేనుడు.ఆయన అంధులు.పొరుగురాజు ఆయన రాజ్యంని ఆక్రమిస్తే కొడుకు సత్యవంతుడు భార్య తో అడవిలో ఉంటున్నారు.ఆసత్యవంతునే నేను పతిగా వరించాను.
నారదుడు అప్పుడు ఇలా అన్నాడు" సత్యవంతుని
తల్లి దండ్రులు కూడా సత్యపరిపాలకులు.ఆతని గుణగణాలు బలపరాక్రమాలు రూపలావణ్యాలుఅన్నింటా సావిత్రి కి ఈడు జోడు
సుమా ఉజ్జీ. కానీ ఓఏడాదికల్లా అతను మరణిస్తాడు." కానీ సావిత్రి ససేమిరా అతనేనాభర్త
అంది.కర్ర రాయి ఒక్కసారే విరిగిముక్కలౌతాయి.కన్యాదానసంకల్పంకూడా ఒక్క సారే జరుగుతుంది.అశ్వపతి సపరివారంగా అడవిలో ఉన్న ద్యుమత్సేనుని కల్సి ఆయన కొడుకు సత్యవంతుడికి సావిత్రి నిచ్చి పెళ్లి చేశాడు.
ఏడాది గిర్రున తిరిగింది.ఆరోజు సత్యవంతుని ఆఖరి రోజు అని తెలుసుకాబట్టి సావిత్రి కూడా భర్తతో అడవికి వెళ్ళింది.మనసంతా దిగులు గుబులు.కట్టెలు కొట్టి అలసిన సత్యవంతుడు భార్య ఒడిలో తలపెట్టినిద్రపోయాడు. యముడు స్వయంగా అతని ప్రాణాలు హరించాలని వచ్చాడు."అమ్మా!నీభర్త సద్గుణసంపన్నుడు. అందుకే నేనే స్వయంగా వచ్చాను" అని అన్నాడు.ఆపై జరిగిన కథ మనందరికీ తెలుసు.
కానీ నేడు జరుగుతోంది ఏంటి?నేడు యువతులు చాలామంది గొంతెమ్మ కోరికలతో వరునికి షరతులు పెడుతున్నారు."పెద్ద విల్లా లో మనిద్దరమే ఉండాలి.మీఅమ్మ నాన్న మన నెత్తిన ఎక్కరాదు.మా అమ్మ నాన్న బాధ్యత నాతో పాటు నీది.మన దగ్గర ఉంటారు.నేనొక్కదాన్నే సంతానం కాబట్టి( వరుడు కూడా ఏకైక సంతానం!)" కొందరు అమ్మాయిలు విదేశాల్లో స్థిర పడటంకోసం పెళ్లాడి ఆపై విడిపోయి బెదిరించి అతన్నించి ఆస్తి విల్లా లాక్కుని సతాయించి విడాకులిస్తున్నారు. చట్టంని అడ్డంపెట్టుకుని భర్తను సతాయించటం సామాన్య మైంది. పెళ్లి అంటే అబ్బాయిలు వారి అమ్మ నాన్నలు భయపడే రోజులివి! పచ్చి నిజాలు చెప్పడానికి సంకోచంతో నోరెత్తని కలాలు!!?? 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి