సంక్షోభంలో వ్యవసాయ రంగం:- సి.హెచ్.ప్రతాప్
 గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక వంటిది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందినట్లయితే, దేశ ఆర్థిక వ్యవస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగుతుంది.దేశ జనాభాలో 45 శాతం మందికి పైగా ప్రజానీకం నేటికి జీవనోపాధి కోసం వ్యవసాయం పైనే ఆధారపడుతున్నారు. అందుకు భిన్నంగా దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది.
చిన్న కమతాలు, కరవు, అనావృష్టి, సరైన నీటి సౌకర్యాలు, ఆధునిక సాగు పద్దతులు లేకపోవడం వంటి సమస్యలతో భారత వ్యవసాయ రంగం దశాబ్దాలుగా ఇబ్బంది పడుతోంది.దేశ జనాభాలో సగం మంది వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్నారు.
కానీ దేశ జీడీపీలో వ్యవసాయం రంగం ద్వారా వచ్చేది కేవలం 15శాతమే.
పండ్లు, కూరగాయలు త్వరగా చెడిపోతాయి. ప్రభుత్వం లేదా వ్యాపారులు సరైన సమయంలో వాటిని కొనుగోలు చేయకపోతే రైతులకు నష్టం తప్పదు.
భారతదేశంలో ఆహార ప్రాసెసింగ్ అనుకున్నంత వేగంగా సాగడం లేదు. మొత్తం పండ్లు, కూరగాయల్లో కేవలం 5శాతం మాత్రమే ప్రాసెసింగ్ జరుగుతోంది.పైగా గతేడాది ఉన్న ధరల ఆధారంగా రైతులు పంటలు సాగుచేస్తారు. గతేడాది ఏ పంటకైతే ఎక్కువ ధర ఉంటుందో దాన్నే సాగు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు.
వర్షాలు సంవృద్ధిగా పడితే పంట దిగుబడి పెరుగుతుంది.సరఫరా పెరగడంతో డిమాండ్ తగ్గిపోతుంది. ఫలితంగా ధరలు కూడా పడిపోతాయి. రైతులు పంటను కొన్ని రోజులు అట్టిపెట్టుకుని, ఆ తర్వాత ఎంతోకొంత ధరకు అమ్ముకుంటున్నారు.
 
 ఇందుకోసం దేశంలో రైతు రాజ్యం నెలకొల్పేందుకు చిత్తశుద్ధితో కృషి జరగాలి.ఇందుకోసం  అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయశాస్త్ర నిపుణులతో సమాలోచనలు చేసి, రైతు ప్రయోజనాలను పరిరక్షించే, వ్యవసాయాన్ని లాభసాటి చేసే నిర్ధిష్ట కార్యక్రమాన్ని రూపొందించాలి. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడానికి జిల్లావారీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి.నీటి పారుదల సౌకర్యాలు అందుబాటులోకి తేవడం, నిరంతర విద్యుత్‌ సరఫరా, ఎరువులు, పురుగు మందులు అందుబాటు ధరలకు లభ్యం కావాలి. కాంట్రీబ్యూటరీ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ క్రమభద్దీకరణ,గ్రామీణ గిడ్డంగులు, కొన్ని గ్రామాల సమూహంగా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి.    
తల్లిదండ్రులు కూడా చిన్నప్పటినుంచే పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆడ, మగ ఇద్దరినీ సమానంగా చూడాలి, సమానావకాశాలు ఇవ్వడం, బాధ్యతలు నేర్పడం అలవాటు చేసుకోవాలి. పెళ్లయ్యాక కూడా కొత్త దంపతుల మధ్య ఏదైనా సమస్య ఉన్నట్లు కన్పిస్తే దాన్ని గుర్తించి కూర్చోబెట్టి మాట్లాడాలి. తమవల్ల కాదనుకున్నప్పుడు కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లాలి.

కామెంట్‌లు