పుడమితల్లి కవితల్లో టాప్ టెన్ విజేత తిరుమలరావు

 ప్రపంచంలో నిరంతర సాహిత్య సాంస్కృతిక ప్రభంజన సంస్థ ఐన
శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కవితల పోటీలలో కుదమ తిరుమలరావు టాప్ టెన్ విజేతగా నిలిచి మరో ఘనత సాధించారు. 
ఐ.ఎస్.ఓ. గుర్తింపు పొందిన తొలి సాహితీ సంస్థ ఐన శ్రీశ్రీ కళావేదిక నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో తిరుమలరావు పాల్గొని విజేతగా నిలిచారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ కుమార్ నేతృత్వంలో ఢిల్లీ కేంద్రంగా అంతర్జాలం ద్వారా పుడమితల్లి అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీలకు నాలుగు వందల మంది కవితలు పంపగా, 'తరగని గని' అనే కవితను పంపిన తిరుమలరావు విజేతగా నిలిచారు. 32 ప్రపంచ రికార్డులను సాధించిన ఏకైక సంస్థ శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీభూషణం, జాతీయ కో ఆర్డినేటర్ నూక సంపత్, జాతీయ సోషల్ మీడియా ప్రతినిధి నల్లా భాగ్యలక్ష్మి తదితరులు తిరుమలరావును అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని పంపారు. ఆకాశమే హద్దుగా తన స్థాయిని నింగి చెబితే, నేలవిడిచి సాము చేయొద్దంటూ ఈ పుడమితల్లి చెబుతుందని తిరుమలరావు తన కవితలో రచించారు. నింగిలో తారలు, నేలపై తరాలు అని పోల్చుతూ తన భావాలను, అలాగే బిడ్డ నడతకు అమ్మా నాన్నలైతే,  సృష్టి నడకకు నింగీ నేలలంటూ తన కవితలో చాటిచెప్పారు. ప్రకృతి తయారు చేసిన గోళం ఈ భూమితల్లి సర్వరోగ నివారిణి అంటూ, భూదేవి కున్నంత సహనం అనే‌ ఉదాహరణే పుడమితల్లి ఘనత అని తన కవితలో విపులీకరించారు. తిరుమలరావు విజేతగా ఎంపికగుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు