నిజాయితీ :- భూపతి జ్యోత్స్న-ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు.రామయ్య రోజు కట్టెలు కొట్టడానికి వెళ్లేవాడు .అలా ఒక రోజున రామయ్య కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు .అలా వెళ్ళిన కొద్దిసేపటికి అటు ఇటు చూశాడు అప్పుడు ఒక నది ఒడ్డున ఒక పెద్ద చెట్టు కనిపించింది.ఆ చెట్టును నరికి వేద్దాం అని అనుకోని ఆ చెట్టును నరకడానికి వెళ్ళాడు .అలా ఆ చెట్టును నరుకుతుండగా గొడ్డలి పొరపాటున చేజారి పక్కనున్న నదిలో పడిపోయింది. రామయ్య ఇలా అనుకున్నాడు "అయ్యో నా గొడ్డలి నదిలో పడిపోయిందే ఇప్పుడెలా" అని అనుకుంటుండగా నదిలో నుంచి ఒక మాయ దేవత వచ్చి ఒక బంగారు గొడ్డలి తెచ్చి "ఇదేనా నీ గొడ్డలి "అని అడిగింది ఆ దేవత .అందుకు రామయ్య కాదు నా గొడ్డలి బంగారు రంగులో ఉండదు అని అన్నాడు.మళ్ళీ లోపలికి వెళ్లి వచ్చి వెండి గొడ్డలిని తెచ్చి ఇదేనా నీ గొడ్డలి అని మళ్ళీ అడిగింది .ఇది కూడా కాదు అని అన్నాడు రామయ్య .ఇప్పుడు వెళ్లి రామయ్య గొడ్డలి తెచ్చింది ఇదేనా నీ గొడ్డలి అని మళ్లీ అడిగింది .అది చూసి రామయ్య ఆ ఇదే నా గొడ్డలి ఇదేనా అసలైన గొడ్డలి అని అన్నాడు. రామయ్య నిజాయితీని గమనించిన దేవత రామయ్యకు బంగారు వెండి గొడ్డలిలను ఇచ్చింది. అది చూసి రామయ్య నాకు నా గొడ్డలి తప్ప ఇవన్నీ వద్దు అని అన్నాడు రామయ్య. అప్పుడు ఆ దేవత నీ మంచి  మనసుని నేను గమనించాను నువ్వు తప్పని సరిగా ఇవి తీసుకోవాల్సిందే అని అన్నది దేవత .సరే అని అవి తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడురామయ్య. 

 ఈ కథలోని నీతి  : మనం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి .ఎప్పుడూ కూడా అత్యాశ పడకూడదు.

కామెంట్‌లు