షరా ..అన్నీమామూలే ..!!---డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 చిన్నప్పుడే నికోకి,
చిన్నచిన్న కార్లు 
విమానాలు ...
ఇతరవాహనాలతో 
ఆటలేఆటలు .....!
అసలుకారు-
నడుపుతానంటాడు ,
పార్క్ చేసిన బండి-
ఎక్కుతానంటాడు ,
ఎవరిప్రమేయం-
లేకుండానే ,
బండి ఎక్కే ప్రయత్నం 
చేస్తుంటాడు ....!
పిల్లకాకికేమి తెలుసు -
ఉండేలుదెబ్బ ...అన్నట్లు ,
జారిపడితే ఏమౌతుంది ?
ఏమౌతుందీ....
దెబ్బతగిలి -
ఏడుపు మొదలవుతుంది !
అదెంతసేపో కాదులే,
నొప్పిమాయంకాగానే ,
నివిన్ ..కి,
మళ్లీ ..షరా ..అన్నీ మాములే !!

కామెంట్‌లు