రాలినవయితేనేం
దారిని పూలదారి చేసాయి
అడుగుకు తోడుగా
అనునయపు ఆదరం చూపాయి
దూరతీరాల కనపడే వెలుగు
కణకణములో కనపడని
నూతన స్పందన ఏదో
నడకలో వడిని పెంచింది
చుట్టూ ఆవరించిన గాలి
చుట్టేస్తూ ప్రేమగా
భుజాన చేయివేసి తోడుగా
నాతో నడుస్తానంటోంది..
కనపడని శక్తి ఏదో
లోన ప్రవేశించి
చేలో కలుపు తీసినట్టు
మనసు స్వచ్చం చేసింది
కనిపించే పచ్చదనం
కంటికి ఇంపుగా తోచి
లోకం ఎంతో అందంగా
అపురూపంగా తోస్తోంది
నిర్మలమైన మనసుతో
నిన్నలను మరచి
నేను.. నాదన్నది కాక
అందరి బాగు కోరితే...
అందరిలో ఒకరైన భావము
అనుపమానమైనదై
అంతరంగాన అంతులేని
ఆనందము నింపునని తెలిపే
అపురూప భావననిచ్చే ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి