సుప్రభాత కవిత : -బృంద
భరించలేని బాధనైనా 
సహించేది బంధం 
త్యజించలేని  ఓర్పు
వహించేది ప్రేమ

ఆలోచన ఆపగలదు 
అనర్థాలు ఎన్నిటినో 
అసహనం అన్నిటికీ 
అనుచితమే ఎప్పటికీ

తుంచుకోడం తేలికే 
ఎపుడైనా ఏదైనా 
పెంచుకుంటే పెరిగేదే 
ప్రేమైనా పగైనా!

సహనంతో మార్చుకుని 
సర్దుకుంటూ సాగితే 
అహంకారమైనా ఒదిగి 
వద్దకొచ్చే తీరుతుంది!

చిత్రమైన భావాల 
విచిత్ర మైన వ్యక్తిత్వాల
విడలేని ముడులే 
వింతైన కథలే జీవితాలు!

వెనక్కు తిరిగి చూసుకుంటే 
మిగిలేవే జ్ఞాపకాలు 
అందంగా మలచుకునే 
నేర్పులే అనుభవాలు!

జీవితాన వెలుగు నింపే 
వేకువకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు