అనగనగా ఒక గ్రామం ఉండేది,ఆ గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు,ఒక రోజు మామిడి చెట్లు తెచ్చీ పక్క పక్కనే నాటాడు, తొందరగానే పెరిగి పెద్ద పెద్ద చెట్లు అయ్యాయి, తన కళ్ళముందే పెరిగి పెద్దవైన తన మామిడి చెట్లును చూసి సంతోషించాడు,రాము నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చూసుకుంటున్నావు,తొందరగానే నేను మంచి మామిడి పండ్లను ఇస్తాను,అని అన్నది మొదటి మామిడి చెట్టు,రాము వాడు చెప్పినట్టు నన్ను కూడ బాగా చూసుకుంటున్నవు,కానీ వాటిలా కష్టపడలేను, తినడానికి పండ్లు ఇవ్వమని ఇబ్బంది పెట్టవద్దు, పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని అంటారు,వాటిలాగా నేను కష్టపడలెను, రెండో మామిడి చెట్టు మాటలు విని సరే అన్నాడు రాము,మాటల ప్రకారం మొదటి చెట్టు అన్నట్టే బోలెడు పండ్లు కాసింది,ఆ పండ్లు తియ్యగా ఉండడంతో దారిన పోయేవాళ్ళు నాలుగు పండ్లు కోసుకొని వెళ్ళేవాళ్ళు, వెళ్తూ వెళ్తూ అది ఎప్పుడూ పచ్చగా అలాగే కాయాలని అక్కడ దగ్గరలో ఉన్న బావిలో బాకెట్ నీళ్ళను తీసుకొని, మొదటి చెట్టుకు పోసి వెళ్ళేవారు, మిగతా రెండో చెట్టుకు ఒక్క పండు కూడ కాయలేదు,పండ్లు కాయలేని చెట్టు వైపు ఎవ్వరూ చూసేవాళ్లు కాదు,దానికి సరిగ్గా తిండి లేక, ఆ చెట్టు ఎండిపోయింది, ఆ చెట్టు తన తప్పును తెలుసుకున్నది, అక్కడికి వచ్చిన రాముతో,నన్ను క్షమించు నా తప్పు తెలుసుకున్నాను అని అన్నది,చెట్టు తప్పును తెలుసుకున్నందుకు సంతోషించాడు రాము.
ఈ కథలోని నీతి: కష్టపడితే సుఖం మరియు ఆనందం లభిస్తుంది
ఈ కథలోని నీతి: కష్టపడితే సుఖం మరియు ఆనందం లభిస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి