పలు జాతీయ,అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త, ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ సారథ్యంలో కొనసాగుతున్న ఎలైట్ సంస్థ కార్యనిర్వాహక సభ్యులుగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కవయిత్రి, రచయిత్రి రామగిరి సుజాత ను నియమిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
నిజాంబాద్ జిల్లా వాస్తవ్యురాలైన రామగిరి సుజాత యం. ఎ. తెలుగు పట్టభద్రురాలు. 24 సంవత్సరాలుగా వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయురాలుగా కొనసాగుతున్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ప్రశంసలు అందుకున్నారు. ప్రవృత్తి రీత్యా కవయిత్రిగా సాహిత్యంలో వివిధ ప్రక్రియల యందు ప్రవేశం కలిగి ఆటవెలదిపద్యం, గజల్, సమీక్ష, చిన్నకథలు, రుబాయిలు,వచన కవితలు రాస్తున్నారు. "ఆరనిజ్యోతి" కవితతో మంచి గుర్తింపు పొందిన సుజాత "హృదయ రాగాలు" కవితా సంపుటిని వెలువరించింది. వీరి యొక్క రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి ఎలైట్ సంస్థలో 300 మందికి పైగా సభ్యులు కవులు రచయితలు కొనసాగుతున్నారు. కవనం కమనీయం, కథా సమయం శీర్షికలతో కవులు రచయితలను ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు సమూహం ద్వారా ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్నది. సాహిత్యం సమాజహితంగా వివిధ ప్రక్రియలలో విశేష కృషి చేస్తున్న సుజాత ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ సాహితీ సేవలో భాగమవుతున్న సందర్భంగా సంస్థ బాధ్యులు కందాళ పద్మావతి, కట్టెకోల విద్యుల్లత , పి వసంతా లక్ష్మణ్, పలువురు కవులు, రచయితలు శుభాకాంక్షలు తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి