నాలుగు తలల సింహం!!:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
భారత 
ఆర్థిక దుస్థితికి చికిత్స చేసిన 
డాక్టరు ఆయన. 

కౌటిల్యునీ
అర్థశాస్త్రానికి తొలి డాక్టరేట్ ఇచ్చిన 
ఆచార్యుడు ఆయన. 

దశ వత్సరాలను 
దశావతారాలుగా మార్చిన 
భారత పురాణపురుషుడు అతడు.!!

గర్జించని 
నాలుగు తలల సింహం అతను!!!

అతను ఎక్కడ కూర్చున్న 
అదే సింహాసనం.!!
ప్రతిపక్షాలకు అతను ఒక సింహ 
స్వప్నం. 

మాట్లాడకుంటే మాటలు పడిపోతాయి.
కానీ 
మాట్లాడకుండానే ప్రభుత్వాన్ని 
పదేళ్లు పడిపోకుండా నిలబెట్టిన 

మూగవాడు కాదు ఒక మగాడు అతడు.!!

జగమెరిగిన భారత మాజీ ప్రధాని నిజంగానే నేడు మూగవాడయ్యాడు. 

మాజీ పి.ఎం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళి.
డా.ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు