*మత్తకోకిల*
రేగు పండ్లను దెంప బాలలు రేషమందున దుంకుతూ
సాగుతుండెను తోవలందున సందు జూసియు చేతులన్
వేగమందున లోన పెట్టియు పిందే కాయలు పట్టగన్
వంగినిల్చియు ముండ్లకంపల పక్కకొంచుము జాగ్రతన్
*కందం*
ముండ్లను కలిగిన చెట్టున
కండ్లకు రేగు కనిపించి కదిలెను చేతుల్
పండ్లను దులుపుతు జేబులు
నిండిన మనసంత హాయి నిల్చియు పరుగుల్
*ఆటవెలది*
ముండ్ల చెట్టునందు మురిపించు రేగులు
తెంపి తినిన కాయ తీపివగరు
పండ్లు మధురిమందు పలుకుల దవడలు
గోరువోయి పండ్లు గిర్రుమనును

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి