చెట్ల ప్రాముఖ్యత :- పి.ఉత్తేజిత ,-ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 చెట్లు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం,భూమిపై చెట్లు వలన పచ్చని వాతావరణం నెలకొంది.చెట్లు మానవులకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి.చెట్లువలన గాలి,నీడ,ఆహారం మరెన్నో లభిస్తాయి. చెట్ల నుండి పండ్లు,కూరగాయలు లభిస్తాయి. చెట్లు కాలుష్యాన్ని  తగ్గించి,పర్యావరణాన్ని రక్షిస్తాయి. చెట్ల వలన వర్షాలు పడి,పంటలు పండుతాయి. చెట్లు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ప్రాణులకు ఆక్సిజన్ ను అందజేస్తున్నాయి. చెట్లు చాలా రకాలు మామిడి చెట్టు,కొబ్బరి చెట్టు,వేప చెట్టు ఇలా ఎన్నో  రకాలు ఉన్నాయి.చెట్ల వలన పుష్పాలు కూడా లభిస్తాయి. చెట్లు లేకపోతే ఈ భూమి పై ఏ ప్రాణులు కూడా నివశించలేవు ఎలాంటి ఆహారం లభించదు. కావున మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని  రక్షిదాం. వృక్షో రక్షతి రక్షితః

కామెంట్‌లు