నేటి ...నికో ...!!--- డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 తువాలు కట్టుకోనివ్వడు
కట్టుకుంటే....
విప్పెవరకూ వదిలిపెట్టడు!
మెడకు ...
మఫ్లర్ చుట్టుకోనివ్వడు
చుట్టుకుంటే....
విప్పెవరకూ వూరుకోడు!
అది అయ్యేవరకూ
చెప్పినమాట వినడు
ఆకలైనా 
పాలుతాగడు.....!
పట్టినపట్టు విడువడు
తనపని అయ్యే వరకూ
విడువడు.....!
ఇప్పుడే ఇలావుంటే....
భవితలో-
ఎదిగిన నికో ని,
వూహించుకోలేక పోతున్నా!!
                ***
కామెంట్‌లు