శ్లో:! భృంగీఛ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్పురన్మాధవ
హ్లాతో నా దయుతో మహాసితవపుః పంచేషు ణా చా దృతః
సత్పక్షస్సుమనోవనేషు స పున స్సాక్షాన్మదీయే మనో
రాజీవే బ్రమరాధిపో విహరతాం శ్రీ శైల వాసీ విభుః !!
భావం: భృంగీశ్వరుని కోరిక మేరకు తాండవము
చేయుట యందు మిక్కిలి నేర్పు గలవాడును,
గజాసురుని మదమును అణిచి నటి
వాడున్నూ, మోహిని రూపము ధరించిన
మాధవని ద్వారా ఆనందమును పొందిన
వాడును, శంఖాధినాదములచే సేవించబడు
వాడును, మిక్కిలి తెల్లని శరీరము
గలవాడును, మన్మధుని బాణములు లక్ష్యము
చేసుకొని బడిన వాడును, దేవతలను,
సజ్జనులను ,రక్షించుట యందు
ఆసక్తి గలవాడును, ప్రత్యక్షము గా శ్రీశైలము
నందు భ్రమరాంబికా పతి భ్రమరాంబికా ప్రతి
అయి నివసించు వాడును అగు ఆ
మల్లికార్జున స్వామి నా హృదయ
పద్మము నందు నివసించు గాక.
******
శివానందలహరి:- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి