ప్రజల్ని కలిపేది!!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా
మనిషి సృష్టించిన దేవుడు 
మనుషుల్ని విడగొట్టాడు.!

మనిషి సృష్టించిన మతం 
మనుషుల్ని విడగొట్టింది.!!

మనిషి సృష్టించిన కులం 
మనుషుల్ని విడగొట్టింది.!!

మనిషి సృష్టించిన ధనం 
మనుషుల్ని విడగొట్టింది.!!!

నమ్మకం పునాదుల్లోని 
దేవుడు మతాన్ని విడగొట్టాలంటే 
ప్రశ్నించే ప్రశ్న మొదలెట్టాలి ఆ ప్రశ్న 
శాస్త్రం శాస్త్ర విజ్ఞానం.!!!?

వివక్షను సృష్టించిన ధనం కులాన్ని 
విడగొట్టాలంటే 
జ్ఞానం శ్రమను పెట్టుబడి పెట్టాలి సమూహాన్ని కూడా గట్టాలి!!!!

రాజులు రాజ్యాల చేతుల్లో అధికారం ఉంటే 
రాజ్యంలో మళ్లీ మతం ఉంటుంది కులముంటుంది ధనం ఉంటుంది 
ఇదే చరిత్ర అవుతుందని చరిత్ర చెబుతుంది.

ప్రజల చేతుల్లో 
విజ్ఞానం చదువు సంపద ఉంటే 
కులం మతం వివక్ష ఉండదు.!!?

అన్ని రాజకీయాలు 
కులం మతం ధనం చుట్టు తిరుగుతున్నాయి. 

కొంతమంది కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. 
కొంతమంది మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. 
కొంతమంది శ్రమ దోపిడి ధనం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. 

ప్రజల్ని విడగొడుతున్నారు విభజిస్తున్నారు పరిపాలిస్తున్నారు. 

ప్రజల్ని కలిపేది కేవలం విజ్ఞానం చదువు సంపద మాత్రమే. 
రాజకీయాలు కాదు.!!!?

సమూహ రాష్ట్ర మహాసభల కవి సమ్మేళనం కోసం. 

డా.ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు