ఐ సి యూ - ఐలేని గిరి
ICU- ఆసుపత్రి అంతర్నేత్రం
అత్యవసర సేవల సత్రం
అక్కడి ప్రపంచమే వేరు
ఎవరినీ అనుమతించకుండా 
అన్నీ తామై ప్రాణాలను నిలబెట్టే ప్రదేశం

అక్కడ అంతా నక్షత్రాల వెలుగులే
దేవకన్యల సేవలు
దేవదత్తుల సపర్యలు 
ఒంటికి సలైన్లు ఇంజెక్సన్లు 
బోర్డు మీద కనిపించే
శరీరపు అంతః కదలికల 
పర్యవేక్షణ - బేరీజు అంతా చూసేది వాళ్ళే
ఒంటేలు పోసుకున్నా తీసేది వాళ్ళే
ఒంటి మురికి తుడవాలన్నా వాళ్ళే..
అది వాళ్ళ బాధ్యతల ఆస్థానం

ఓ సూర్యుడు వెలిగినట్టు
ఓ చంద్రుడు నింగినుంచి దిగినట్టు
డాక్టరు ప్రవేశం, పరామర్శ
రుగ్మత తాలూకు అన్నీ చక్కబడితే
డాక్టరు ఆదేశంతో  ICU నుంచి  అవతలికి

కార్పొరేట్ ఆసుపత్రి అంటేనే ఖరీదు
అయితే ఏదీ ప్రాణం కన్నా ఖరీదు కాదు
రేపు ఎంత సంపాదిస్తామో తెలియదు
కానీ రేపటికోసం ఇవ్వాళ్ళటి ఖరీదు....
ఇక జీవించాల్సింది ఇంటెన్సిటీ తోనే
ఇంటెన్సివ్ కేర్ తోనే...
        &&&&.  &&&&

కామెంట్‌లు