చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

*సీస పద్యం*


వేకువ జామున వెళ్ళుతు రైతులు
పంటల సాగుకు పనులు జేయ
చలిపులిని మరచి సక్కగ తిరుగుతు
గోదల పేడలు గూడితీసి
హద్దుల చుట్టుయు యంగలు వేయుచు
గడ్డిమోపులనెత్తి కదిలిసాగి
దొడ్డిన పచ్చిక దూడల కేసియు
పాలతో యింటికి పరుగులెట్టి

*ఆటవెలది పద్యం*

వాడికిండ్లనందు వరుసగా పోసియు
ఇల్లు జేరినంత యింతికాచి
పాల మీగడందు పిల్లల మీసాలు
చలిని మరచిపోయి సాగుదినము

*కందం పద్యం*


మంటలు కొరకై జనులున్
వెంటన కర్రలను తెచ్చి వేగిరమందున్
జంటగ దుప్పట్లందున
పెట్టన పుల్లలను గీసి వేడిని పంచేన్

*తేటగీతి పద్యం*

చలిపులియనిన మగువలు సాన్పుచల్లి
సకల పనులను నేర్పుగ చక్కదిద్ది
వంట వార్పులందున సాగి వణకకుండ
చలిని ప్రారదోలును స్త్రీలు సకలముగను



కామెంట్‌లు