“బిల్వాటవీ మధ్య లసత్సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టామ్
తిష్టాపదాంభోరుహ పాణిపద్మాo
సువర్ణ వర్ణామ్ ప్రణమామి లక్ష్మీమ్!!
భావము:-అమ్మ బిల్వవనం మధ్యలో ఉంది. బిల్వవనం లక్ష్మికి అనగా సంపద కొలువుండే చోటు.ఆ వనంలో
వికసించిన వేయిరేకుల పద్మం ఉంది. పద్మం కూడా సంపదలుండే చోటు.
దానిలో అమ్మ కొలువు తీరి ఉంది.ఆమె చేతులకు బంగారు కమలాలు ధరించి, కనకాన్ని వర్షింప జేస్తూవుంది.అమ్మ బంగారు ఛాయతో ధగధగా మెరిసిపోతోంది.అని అమ్మ స్థూల రూపాన్ని ఈ స్తోత్రంలో వర్ణించారు శ్రీశంకరులు.ఇది సాకారోపాసన.
—-----------------------------------------
1- ఏనుగుతల
2- ఆవు వెనుక తట్టు
3- పద్మం
4- మారేడు దళం
5- సుమంగళి సీమంత ప్రదేశం
ఇవికూడా శ్రీలక్ష్మి వసించే ప్రదేశాలు.
—---------------------------------------

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి