చిరునవ్వుల వెన్నెల పంచుతూ
సిరిమువ్వల సవ్వడి చేస్తూ
గిరి శిఖరాల నుండీ జారుతూ
దివిజ గంగలా ఇలకు దిగివచ్చి
పుడమికి పుత్తడి పంటలు ఇచ్చి
జగతికి జీవంగా జీవుల దాహం తీర్చి
అవనికి అలంబనగా అలరారి
ధరాతలపు చైతన్య దీపికగా...సాగే
సెలయేరు తన పనికి ప్రతిఫలమడిగితే
ఇవ్వగలడా మానవుడు?
ప్రకృతి ఇచ్చిన సౌకర్యాలను
అనుభవించే ప్రతి క్షణము తలవొద్దా?
చిన్ని చినుకులు వానగా
వాగు వంకలతో కలిసి నదిగా
కదిలివచ్చు కన్నతల్లిలా
ఆదరించే జలధార అమ్మ కాదా?
ధరణికి తరుణిమనిచ్చే దివ్య ధార
పరులకు మేలును కూర్చాలనే
గురుతర బాధ్యత గుర్తు చేసే
గురువుగ భావించకుంటే ఎలా?
ప్రత్యక్ష గురువైన ప్రకృతికి
ప్రణామాలతో
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి