అమ్మా ..అనిపిలవడంలో
నాన్నను కూడావదల్లేదు ,
'అమ్మ'పిలుపులో ఆనందం
అలాచేసిందేమో తెలియదు !
ఇప్పుడు ...
'నాన్నా ..' అని పిలవడంకంటే
'డాడీ ' అనిపిలవడంలో ...
సౌకర్యం ఉందేమో ....
డాడీ ..డాడీ ...అంటూ ..
తండ్రిని చుట్టేస్తాడు ...
మనవడు నికోబాబు,
అనుకున్నది సాదిస్తాడు !
ఆదివారం చర్చికి -
అందరితోపాటు తయారు ,
కొద్దిక్షణాలు కాగానే ...
బయటకు తీసుకెళ్లమని
ఒకటేపోరు .....!
తీసుకెళ్లకుంటే ....
ఎత్తుతాడు పెద్దఎత్తున
రాగం ....
తండ్రి వినోద్ కు తప్పదు
అప్పడప్పుడూ ఈడ్యూటీ !
సంసారసాగరం లో ...
తప్పదుతండ్రికిఈ ప్రయారిటీ !!
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి