కథకు వస్తువుదొరకడం పెద్ద కష్టంకాదు ,కానీ అందిన వస్తువును కథగా మలచడం అంత
సులభం కానేకాదు . అలాగే ,బాల్యంలో ,చదువుకునే సమయంలో ప్రతిఒక్కరికీ ఎన్నో అనుభవాలు ఉంటాయి ,కానీ వాటిని సింహావలోకనం చేసుకునేవాళ్ళు బహుకొద్దిమంది .
గుర్తుచేసుకున్నా ,వాటిని అక్షరబద్దం చేసేవాళ్ళు కూడా బహుఅరుదు . ఇలాంటి వారికి
భిన్నంగా ,తమ బాల్యంలోని కొన్నిసంఘటనలను అతిసహజంగా కథలరూపంలో అక్షరబద్దం చేశారు ‘ విజయమహల్ సెంటర్ ‘ అనే కథాసంపుటిలో ,ప్రముఖ కవయిత్రి
కథారచయిత్రి ,శ్రీమతి రోహిణి వంజారి . ఈ కథా సంపుటిలోని మొదటి కథ ‘ వొజ్రం -
ఇలువ ‘ .
ఈ కథతో పాటు మరో ఇరవై కథలు ఈ కథాసంపుటిలో వున్నాయి . ఇంచుమించు అన్ని కథల్లోను ,రచయిత్రి అనుభవాలను రంగరించి ,చక్కని కథలుగా మలిచినట్టు అనిపిస్తున్నది . ముఖ్యంగా స్థానిక మాండలికాన్ని స్వేచ్ఛగా ఉపయోగించుకుని కథలకు ప్రత్యేకతను తెచ్చిపెట్టారు రచయిత్రి . అంతమాత్రమే కాదు మరుగునపడిపోతున్న కొన్ని
పదాలను నేటితరం గుర్తుచేసుకునేట్టుగా ఈ కథల్లో మనకు కనిపిస్తాయి .
ఇంతకీ .. ‘ వొజ్రం ఇలువ ‘ కథాంశం ఏమిటంటే కథాకాలంలో లోకాలయ్య.. ముద్దు పేరుగల
అమ్మాయి ,స్కూల్ ఫీజ్ కట్టమని తండ్రి ఇచ్చిన పావలా ,బడిదగ్గర మురికి కాలవలో
అనుకోకుండా జారిపడినప్పుడు ,పావలానే కథా అని నిర్లక్ష్యం చేయకుండా ,తండ్రి ఆ ,, మురికి కాలవలో దిగి ,చేతికి గాజుపెంకు గీసుకుని రక్తంకారుతున్నా ,ఓపిగ్గా వెతికి మట్టిలో వున్న పావలా దొరకబట్టడం . అప్పుడు ఆ .. పావలా వజ్రం అంత విలువైనదిగా రచయిత్రి
నిరూపించడం బాగుంది . డబ్బు విలువ కూతురికి తెలియజెప్పడానికి అంత కష్టపడ్డానని
చెప్పడం బాగుంది .
ఈ కథా సంపుటిలోని వైవిధ్యమైన కథలగురించి తెలుసుకోవాలన్నా ,రచయిత్రి కథన రీతిని అర్ధం చేసుకోవాలన్నా ‘’ విజయ మహల్ సెంటర్ ‘’ కథా సంపుటి కొని ,మొత్తం కథలన్నీ చదవాల్సిందే .. మరి ఇక ఆలస్యమేల !
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి