ప్రకృతిని కాపాడుకుందాం:- : జాల సౌమ్య- ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల- వల్లాల
  అనగనగా ఒక ఊరిలో రామయ్య,సోమయ్య అనే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వ్యవసాయ భూమిలో ఎప్పుడూ ఏదో ఒక పని చేసేవారు,రామయ్య,సోమయ్య మంచి మిత్రులు కూడా,సోమయ్య తన వ్యవసాయ భూమిలో రసాయనిక ఎరువుల మందులతో వ్యవసాయం చేసి అధిక డబ్బు సంపాదించేవాడు, కానీ రామయ్య పకృతి ఎరువులు,అంటే ఆవు పేడతో,ఆకులు అలములతో సహజ సిద్ధంగా వ్యవసాయం చేసేవాడు, కొద్ది కాలానికి సోమయ్య చేసే పొలంలో సారవంతమైన నేల మరియు తగ్గిపోవడం జరిగింది,అదేవిధంగా పంటలో దిగుబడి కూడా తగ్గింది, క్రమంగా అప్పుల్లోకి కురుకుపోయాడు,కానీ రామయ్య మాత్రం సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా మేలు రకమైన పంట, అధిక దిగుబడి రావడం జరిగింది రామయ్య పొలంలో సారవంతమైన నేలతోపాటు, పోషకాలతో ఉండేది. ఎప్పుడు రామయ్య మేలు రకమైన పంట పండించడం వల్ల అధిక దిగుబడి తో  పంట పండించేవాడు సోమయ్య పొలంలో అధిక రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల నేల మరియు పక్షులు, పశువులు, పాములకు కీటకాలకు హాని కలిగించేది దీనివల్ల క్రమంగా సోమయ్య పొలంలో సారవంతమైన నేల తగ్గిపోయింది .

ఈ కథలోని నీతి:పకృతిని కాపాడుదాం పక్షులను నీళ్ళను చెట్లను కాపాడుదాం

కామెంట్‌లు