మీ పాట... మీ నోట ! వీడ్కోలు గీతం: -కోరాడనరసింహా రావు
పల్లవి:-
మిత్రమా... ఓ వత్సరమా ! 
 మూడు వందల అరువది ఐదు రోజులూమావెన్నంటి మము నీతో నడిపించుక, ఇంత వరకు తెచ్చావు...! 
 ఇపుడు వీడ్కోలు అంటూ నీవు మరలి పోతున్నావా ! 
 నీ కునూ ఇవియే మా ప్రతి వీడ్కోలు ప్రణామ ములు...!! 

చరణం :-
  నీవు వచ్చి అపుడే వత్సరము గడచి పోయినది...! 
 నిన్ను ఆనాడు నీ రాకకై... 
 ఎన్నో ఆశలతో ఎన్నెన్నో కోర్కెలతో , మాకు అన్నీ సుభములనే చేకూర్చమని
ఎట్టి కష్ట, నష్టములు కలుగ జేయ వద్దని... ప్రార్ధించి స్వాగతించితిమి!  "మిత్రమా...ఓ వత్సరమా"
చరణం:-
 మా మొర లాల కించితివి
 ఎంద రెందరో ఎన్నెన్నో విధములఇబ్బందులుపడి నా...భూకంపములు, జల ప్రలయములే వచ్చినా... వాటిని మాదరికి రానీయక
 ఎట్టి సమశ్యలలో బడ ద్రోయక...మాకు హితుడవై స్నేహితుడవై క్షేమముగా గట్టెక్కి0చితివి...! 
  నీ కివే మా కృతజ్ఞతా పూర్వక వీడ్కోలు ప్రణమములు...!!... 2
     *****

కామెంట్‌లు