పువ్వులు దోసిట నింపి
నవ్వులు మోమున ఉంచి
దవ్వున వెలిగే గగనదీపాన్ని చూడ
రివ్వున ఎగిరెను నేల నింగికి!
అందమైన వెలుగు పువ్వును
సందిట బందీగా చేయాలని
ముందే వేచి నిలిచినా అది
అందేనా కాసారపు చేతికి?
ఎదురు చూసిన క్షణమొచ్చి
నుదుట బొట్టుగా చుంబించి
ముందుకు సాగిపోయే భానుని
బంధించగలరా ఎవరైనా?
విసుగన్నది లేకపోగా
అలుపసలే ఎరుగక
కదిలిపోయే కాలచక్రాన్ని
క్షణమైనా ఆపగలమా?
అంతు దొరకని వింతలకైనా
అదుపు లేని ఆశలకైనా
అలవికాని అలజడికైనా
ఆఖరి సమాధానం సమయానిదే!
నడిచొచ్చే దైవానికి
ఎదురొచ్చే కష్టం బాపి
కలిసొచ్చే అదృష్టాన్ని
వరమిచ్చి బ్రోవమంటూ...
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి