మహాభారతంలో కొందరు స్త్రీలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 భారతం అనగానే సత్యవతి కుంతి ద్రౌపది గుర్తు కొస్తారు.కానీ ఇంద్రుని భార్య శచీదేవి ని గూర్చిన కథ ఉంది.నహుషుడు ఇంద్రపదవి చేపట్టి మొదట ధర్మా త్మునిగా పాలించినా క్రమంగా అతనిలో పైశాచికత్వం పెరిగింది.సుఖభోగాలు భుజగర్వం మనిషి పతనంకి
దారితీస్తాయి.అందుకే మదగర్వం అహంకారం తో
భోగలాలసుడై శచీదేవిని తన భవనానికి రమ్మంటాడు.ఆమె బృహస్పతి ని శరణు వేడింది." బ్రహ్మర్షీ! దేవేంద్రుని భార్య ను.ఒక్కనికే పత్నిగా ఉంటావు" అని మీరు నన్ను ఆశీర్వదించారు.నహుషుడు నన్ను చెరబట్టాలని చూస్తున్నాడు.మీమాట వమ్ము కావాల్సిందేనా?" అని
నిలదీసింది.అప్పుడాయన ఓదారుస్తూ" నీవు వాడికి
భయపడకు.నీభర్తను త్వరలో కలుస్తావు"అని,ఊరడిస్తాడు.ఈవిషయంతెల్సి నహుషుడు కోపంతో రెచ్చిపోయాడు.దేవతలు బృహస్పతిని బతిమాలారు శచీదేవిని అతని దగ్గరకు పంపమని.ఆయనిలా అన్నాడు" శరణన్నవారిని‌శత్రువుకి అప్పగించరాదు.వాడిపొలంలో విత్తులు మొలకెత్తవు.అతని సంతానం అకాల మరణంకి గురి ఔతుంది" ఇక వారు శచీదేవిని బతిమాలసాగారు"
అమ్మా! నీ పాతివ్రత్యం చేత నహుషుడు పతనమవటంఖాయం.ధైర్యంగా వాడి దగ్గరకు వెళ్లు".
2 పాపం ఆమె సంకోచం తో అతని దగ్గరకు వెళ్తే ఆవదరుబోతు తనని పెళ్ళాడమని కారుకూతలు కూస్తాడు.అప్పుడామె సమయోచితంగా అంది", నాభర్త జాడతెలీకపోతే నేనే స్వయంగా వచ్చి నిన్ను సేవిస్తాను.," ఇంద్రాణి బృహస్పతి దగ్గరకు వచ్చి ఈవిషయం చెప్పింది.అంతాకల్సి శ్రీమహావిష్ణువు నా ప్రార్థిస్తారు.విష్ణువు వారితో". ఇంద్రుడు అశ్వమేథ యజ్ఞం ద్వారా నన్ను అర్చిస్తే తిరిగి రాజు ఔతాడు.   
అలా అశ్వమేథంచేసి ఇంద్రుడు పునీతుడవుతాడు.నహుషుడు తన దృష్టి మాత్రం చేత ప్రాణుల తేజస్సు హరిస్తున్నాడు.ఇంద్రాణి ఉత్తరాయణంకి అధిష్ఠానదేవత రాత్రిదేవిని అర్చించింది.ఉపశ్రుతీదేవి ప్రత్యక్షమై శచీదేవిని తనతో తీసుకువెళ్ళి సరోవరంలో ఓపద్మంలోని కాడలో దాగున్న ఇంద్రుని చూపిస్తుంది.ఇంద్రుడు భార్య కి సలహా ఇస్తాడు "ఋషులు మోసే పల్లకీలో నీవు రావాలి . అని నహుషుడికి
 కబురంపు.వాడిపతనం వాడే కోరుకుంటాడు. 
అలా శచీదేవి కబురంపటం వాడు కొండచిలువ గా మారటం మనందరికీ తెలుసు.ఇంద్రాణి మానసిక వేదన క్షోభ నేడు కూడా మహిళ అనుభవిస్తోంది ఆఫీస్ లో బైట లైంగిక వేధింపులకు మాటలకు బలిఅవుతోంది కదూ?

కామెంట్‌లు