ఈ బాట
నన్ను మా ఊరుకూ బయటి లోకానికి
నడిపించినదే కాబోలు
తేలిన కంకర అతుకుల గతుకులు
అనుభవాల గుర్తుచేసిన తొవ్వలా
అడవి అందాలు తొలిచిన దారి
ముగ్ధమోహన కురుల నడి పాపెడలా
ప్రకృతి ప్రేమ సోయగాల తేలిందా
యవ్వన కేరింతల బతుకు
ఎగిరి గంతేసిన జీవితం నా కనుల
అంతేనా
ఊరంతా ఒకేఒక సైకిల్ మా చిన్నన్న కొన్న
అట్లాస్ సైకిల్ తిప్పిన సవారీలో
పడిలేచిన బాల్యం రహదారి యాదిగా
కష్టాలూ కన్నీళ్లు వొంపుకున్న సంతోషం
వాన తడిసిన మనసు గొడుగుతో
ఆగని నడక గమ్యం
చెప్పుల్లేని కాళ్ళను ముద్దాడిన యాత్ర
మైమరిపించి మురిసిన దృశ్యం
వెలుగిచ్చిన కరెంట్ పోల్
కదలక కదిలించే
చిత్రం కాదులే!
బతికిన బతుకు అపూర్వ జ్ఞాపకం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి