సుప్రభాత కవిత : - బృంద
కొనలో సాగే వాగుకి కూడా 
తప్పక అందే వరమే 
కొత్త వెలుగులు మోస్తూ 
వచ్చే ఉదయమే!

గలగల సవ్వడి చేస్తూ 
జలజలా  జారుతూ 
మిలమిల మెరిసే 
సెలయేరున ప్రతి చినుకు

వాగుతో  స్నేహం కోసం 
వేచిన లతలో బాలలు 
రాలుతు చేయే చాచేను 
సాగుతు మురిసే పోయేను

ఒడిదుడుకులేవీ లేక 
అడుగులు కదిపే పయనంలో 
కలిసొచ్చే  కాలం లా 
కదిలోచ్చే  అదృష్టంగా..

మనసుకు నచ్చే స్నేహం 
మనతో కలిసి నడిస్తే 
మనమే తాననిపిస్తే 
మనుగడ  సుగమము కాదా!

మెల్లగా వీచే గాలి 
చల్లగా వచ్చి చెవిలో చెప్పే 
తెల్లని వెలుగులు తెచ్చే 
కమ్మని వేకువ కబురు...

రాబోయే మంచి క్షణాలకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు